Credits
PERFORMING ARTISTS
Kamal Haasan
Actor
S.P. Balasubrahmanyam
Performer
S. P. Sailaja
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Composer
Vennelakanti
Songwriter
Lyrics
రాయి
ఏం రాయాలి
Letter
ఎవరికి
నీకు
నాకా
Hmm
నాకు రాయడం రాదు
ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా
Wait wait
నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
నాకు చదివి వినిపించి తర్వాత నువ్ చదువుకో
హ్మ్ హ హ హా I like it Hmm చెప్పు
హ్మ్
హు
హ
నా ప్రియా
ప్రేమతో
నీకు (నీకు)
నే
రాసే
నేను
రాసే
ఉత్తరం
ఉత్తరం Letter ఛ
Letter కాదు ఉత్తరమే అని రాయ్
హా అదే
చదువు
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
హహహ పాటలా మార్చి రాసావా
అప్పుడు నేను కూడా మారుస్తా
మొదట నా ప్రియా అన్నాను గదా
అక్కడ ప్రియతమా అని మార్చుకో
ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా
నేనే ఇక్కడ క్షేమం
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఆహా ఓహో నిన్నూహించుకుంటే
కవిత మనసులో వరదలా పొంగుతుంది
కానీ అదంతా రాయాలని కూర్చుంటే
అక్షరాలే మాటలే
ఊహలన్నీ పాటలే కనుల తోటలో
అదే
తొలి కలల కవితలే మాట మాటలో
అదే ఆహా బ్రహ్మాండం
కవిత కవిత పాడు
కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్నీపాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమలేఖనే
రాసింది హృదయమే
లాలలా లాలాల లాలలా లాలాల
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
లాలలా లాలాల లాలలా లాలాల
హ్మ్మ్ నాకు తగిలిన గాయం
అదే చల్లగా మానిపోతుంది
అదేమిటో నాకు తెలీదు ఏమ్మాయో తెలీదు
నాకేమీ కాదసలు ఇది కూడా రాసుకో
అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ
అలాంటివి వేసుకోవాలి ఆ
ఇదిగో చూడు
నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్లు తట్టుకుంటుంది
నీ ఒళ్లు తట్టుకుంటుందా తట్టుకోదు
మా దేవి దేవి ఉమాదేవి
అది కూడా రాయాలా
అహహ అది ప్రేమ
నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక
ఇదవుతుంటే ఏడుపొస్తుంది
కానీ నేనేడ్చి నా శోకం
నిన్ను కూడా బాధపెడుతుందనుకున్నప్పుడు
వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది హహహ
మనుషులర్థం చేసుకునేందుకు
ఇది మామూలు ప్రేమ కాదు
ప్రేమ కాదు ప్రేమ కాదు ప్రేమ కాదు
అగ్నిలాగ స్వచ్ఛమైనది
స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది
గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రిప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్ధభాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలిజో లాలి లాలిజో
ఉమాదేవి లాలిజో లాలి లాలిజో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా
Written by: Ilaiyaraaja, Vennelakanti

