Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Vijai Bulganin
Vijai Bulganin
Performer
Sreerama Chandra
Sreerama Chandra
Performer
Anantha Sriram
Anantha Sriram
Performer
Anand Deverakonda
Anand Deverakonda
Actor
Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya
Actor
Viraj Ashwin
Viraj Ashwin
Actor
COMPOSITION & LYRICS
Vijai Bulganin
Vijai Bulganin
Composer
Anantha Sriram
Anantha Sriram
Lyrics

Lyrics

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో
ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా
ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
తోచిందే ఈ జంట కలలకే నిజములా
సాగిందే దారంతా చెలిమికే ఋజువులా
కంటిరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాక
సందమామ సిరివెన్నెలలాగా వందేళ్ళైనా విడిపోక
ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏవైపుకో తేల్చేది కాలమేగా
ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మాయమా
వేరే ఏ ధ్యాసా లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే తుళ్లే ఆశల్లో
ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందే మెల్లగా మెల్లగా
Written by: Anantha Sriram, Gorthi Vijaya Brahmanandam, Vijai Bulganin
instagramSharePathic_arrow_out

Loading...