Music Video

Music Video

Lyrics

అరె ఉన్న కనుపాపకు చూపులు ఉన్న
కనురెప్పల మాటున ఉన్న
తన చప్పుడు నీదేనా
చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్న
పెదవంచున చిగురిస్తున్న
అవి ఇప్పుడు నీవేనా
నిజమేనా దూరంగా గమనిస్తున్న
తీరానికి కదిలొస్తున్న నా పరుగులు నీవేనా
అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న
ఊపిరిలో ఊగిసలున్నా
నా ఆశలు నీవేనా
పువ్వులకు రంగెయ్యాల
చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల
తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల
చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల
తేలిపోనా
హాయిలోనా
ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నేనై నీతో ఉండనా
సంతోషాన్ని నేను ఎలా దాచుకోను
సరాగాల నావై సమీపించనా
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్నీ మూటగట్టి ఈ వేళ
నా బుల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లీ దారులన్నీ దాటేలా
నేనింక నీదాన్ని అయ్యేలా
పువ్వులకు రంగెయ్యాల
చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల
తేలిపోనా
(జుమ్ అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ్
అ జుమ్ జుమ్ జుమ జుమ జుమ జుమ జుమ్
అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ్
అ జుమ్ జుమ్ జుమ జుమ జుమ జుమ
జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జూ
జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జూ)
మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చూడనా
మన పరిచయమొకటే పరి పరి విధములు లాలించే
ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించే
చేయి చేయి కలపమనీ
పువ్వులకు రంగెయ్యాల
చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల
తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల
చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా
హాయిలోనా
Written by: Bheems Ceciroleo
instagramSharePathic_arrow_out

Loading...