Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
BA NARAYANA
Harmony Vocals
COMPOSITION & LYRICS
Annamacharya Tallapaka
Songwriter
APPALA NARAYANA BONILA
Songwriter
PRODUCTION & ENGINEERING
SVRECORDING PROJECT
Co-Producer
Lyrics
॥పల్లవి॥ కట్టరో కలువడాలు గక్కన వాకిళ్లను
పట్టరో వులుపలు శోభనద్రవ్యములును
॥చ1॥ తిరుకొడి యొక్కెనదె దేవునికల్యాణానకు
గరుడపటము పెఁ(పైఁ?) డి కంబమందును
ధరపై బ్రహ్మాదిదేవతలెల్లాను వచ్చిరదె
వరుసతో వాయిద్యాలు వాయించరో
॥చ2॥ ముంచి హోమములు సేసి మునులు సంభ్రమమున
అంచెల గడియ కుడు కట్టె పెట్టిరి
పెంచముగఁ దెరవేసి పెండ్లిపీఁట వెట్టిరదె
మించఁ బేరంటాండ్లు నర్మిలిఁ బాడరో
॥చ3॥ శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యలమేల్మంగయు
యీవేళఁ దలఁబాలు ఇట్టె పోసిరి
బూవములు పొత్తునను భుజియించి రిప్పు డిట్టె
వేవేలకుఁ గప్పురపువిడే లియ్యరో
Written by: APPALA NARAYANA BONILA, Annamacharya Tallapaka


