Credits

PERFORMING ARTISTS
Devi Sri Prasad
Devi Sri Prasad
Vocals
Allu Arjun
Allu Arjun
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandrabose
Chandrabose
Lyrics

Lyrics

ఛ... వాడికి నా మీద ప్రేమే లేదు
He doesn't love me you know?
No, he loves you
He loves you so much
అవునా ఎంత?
హ్మ్ ఏంటంటే ఆ
మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు
కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు
పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు
జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు
తీరినట్టి భారమంత
ఓ... ఇంకా
హో తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన
అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న
ఆవు పాల నురగంత
హో చల్ల బువ్వలోన నంజుకుంటు
తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్లి ఆడుతున్న
ఆడపిల్ల కోరికంత
Baby he loves you, loves you
Loves you so much
Baby he loves you, loves you
Loves you so much
హే అందమైన నీ కాలి కింద తిరిగే
నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్లలోన మెరిసే
నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొణికే
గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే
నిప్పులాంటి నిజమంత
Baby he loves you, loves you
Loves you so much
Baby he loves you, loves you
Loves you so much
హాయ్ పంటచేలలోని జీవమంత
ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా
వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత
ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత
రామలాలి అంత
Baby he loves you, loves you
Loves you so much
Baby he loves you, loves you
Loves you so much
పచ్చి వేప పుల్ల చేదు అంత (చేదు)
రచ్చబండ పైన వాదనంత
అర్ధమైనా కాకపోయినా
భక్తికొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోన జాబిలంత (జాబిలి)
ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
(Baby he loves you, loves you)
(Loves you so much)
(Baby he loves you, loves you)
(Loves you so much)
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే
మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే
మట్టిపూల విలువంత
హో బిక్కు బిక్కు మంటూ
పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే
ఆటగాడి పొగరంత
Baby he loves you, he loves you
Loves you so much
Baby baby he loves you, loves you
Loves you so much
ఎంత దగ్గరైన నీకు నాకు
మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి
చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున్నా నువ్వు నాకు చేసే
జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే
మా తీపి స్నేహమంత
Baby he loves you, loves you
Loves you so much
Baby he loves you, loves you
I loves you so much
Written by: Chandra Bose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...