album cover
Ganga
album cover
Ganga was released on January 1, 2003 by Aditya Music as a part of the album Gangothri (Original Motion Picture Soundtrack)
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధిం
గంగా
నీ ఉరుకులే రాగంగా
నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా
మధురిమలో మునగంగా
గంగా నిజంగా
నువ్వే నాలో సగ భాగంగా
నీ ఉరుకులే రాగంగా
నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా
నాలో సగ భాగంగా
నీ ఉరుకులే రాగంగా
నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా
నాలో సగ భాగంగా
నువ్విచ్చిన మనసే క్షేమం
నువు పంచిన ప్రేమే క్షేమం
నువ్వై నేనున్నాను క్షేమంగా
మనమాడిన ఆటలు సౌఖ్యం
మనసాడిన మాటలు సౌఖ్యం
మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా
నీ చెవి వినని ఈ సందేశం
నా చదువుకు భాగ్యంగా
ప్రతి పదమున నువ్వు ప్రత్యక్షం
శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా
గంగా నిజంగా
నువ్వే నాలో సగ భాగంగా
నీ ఉరుకులే రాగంగా
నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా
నాలో సగ భాగంగా
నువు పంపిన జాబుల పూలు
నా సిగలో జాజులు కాగా
దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
నీ లేఖల అక్షరమాల
నా మెడలో హారం కాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా
నువు రాసిన ఈ ఉత్తరమే
నా మనసుకు అద్దంగా
నువు చేసిన ఈ సంతకమే
మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా
గంగా నిజంగా
నువ్వే నాలో సగ భాగంగా
నీ ఉరుకులే రాగంగా
నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా
నాలో సగ భాగంగా
నీ ఉరుకులే రాగంగా
నా గుండెల మోగంగా
సరిగమలై సాగంగా
నాలో సగ భాగంగా
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన ధింతన ధింతన
ధింతననన
Written by: Chandra Bose, M.M. Keeravani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...