Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Mahesh Babu
Mahesh Babu
Actor
Sonali Bendre
Sonali Bendre
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Suddala Ashok Teja
Suddala Ashok Teja
Songwriter

Lyrics

బంగారు కళ్ల బుచ్చమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
బంగారు కళ్ల బుచ్చమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
ఎంత ముద్దుగున్నావే
వెండి మువ్వల్లే ఘల్లుమంటుంటే
గుండె జిల్లుమన్నాదే
బంగారు కళ్ల బుచ్చమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
నీలో చింత చిగురు పులుపున్నదే
(బుల్ బుల్ పిట్ట మల్ మల్ పట్ట)
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
(తళుకుల గుట్ట మెరుపుల తట్ట)
హే, నీలో చింత చిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటె మాట వెనక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్లు మూసి చీకటి ఉందంటే
వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన
వెలుగై నిలిచివుంటుందే
బంగారు కళ్ల బుచ్చమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
(సిరి సిరి మువ్వ గడసరి గువ్వ)
మనకు మనకు చెలిమే ఒక వంతెన
(సొగసుల గువ్వ ముసి ముసి నవ్వ)
హే నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా
మురళి కాని వెదురై పోద జన్మ
చేయి చేయి కలిపే కోసమే
హృదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మో
కాలం మాయమరాఠీ
బంగారు కళ్ల బుచ్చమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే
ఎంత ముద్దుగున్నావే
వెండి మువ్వల్లే ఘల్లుమంటుంటే
గుండె జిల్లుమన్నాదే
బంగారు కళ్ల బుచ్చమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
Written by: Mani Sharma, Suddhala Ashok Teja
instagramSharePathic_arrow_out

Loading...