album cover
Nee Tholisariga (From "Santhosham")
5,819
Telugu
Nee Tholisariga (From "Santhosham") was released on June 8, 2015 by Aditya Music as a part of the album R. P. Patnaik - Romantic Telugu Hit Songs
album cover
Release DateJune 8, 2015
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM169

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Usha
Usha
Performer
COMPOSITION & LYRICS
R. P. Patnaik
R. P. Patnaik
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

నీ తొలిసరిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తెల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
నీ తొలిసరిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా
రెక్కలు తొడిగిన తలపునువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పునువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచమా
నీ తొలిసరిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా
ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతం అనుకొని నమ్మతమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతిమదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరు నవ్వుల దగా
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా హా
నీ ఆటెమిటో ఎనాటికి ఆపవు కదా
నీ పాటెమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకొనేవు పంచుకొనేవు ఇంత చలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమ తీరులో ప్రళయమ
పంతమా బంధమ
నీ ఆటెమిటో ఎనాటికి ఆపవు కదా
నీ పాటెమిటో ఏ జంటకి చూపవు కదా
Written by: R. P. Patnaik, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...