Müzik Videosu
Müzik Videosu
Krediler
PERFORMING ARTISTS
Neha Bhasin
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Songwriter
Şarkı sözleri
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఏటు వెళుతున్న ఏం చేస్తున్న
ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అధమరపైన పెదవుల పైన
ప్రతి మాట నువ్వే
అపుడో ఇపుడో ఎపుడైనా
నా చిరునవ్వే నీ వలనా
తెలియని లోకం తీపిని నాకు
రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా
గుర్తుకు రాదా క్షణమైన
యెదురుగా ఉన్న నిజమే కాని
కలవైనవులే
రంగు రూపమంటు లేని లేనిది ప్రేమా
చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తు వుంది
దూరం దగ్గరంటు తేడా చూడదు ప్రేమ
నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
యద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా
ఓ అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఏటు వెళుతున్న ఏం చేస్తున్న
ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అధమరపైన పెదవుల పైన
ప్రతి మాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగ చూడనంటు నన్ను ఒంటరి చేశావే
ఏకాంత వెలలో ఏ కాంతి లేదు ర
నలుసంత కూడా జాలి లేని పంతాలెంటి ఇలా
నీతోడు లేనిదే మనసుండలేదు ర
నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఏటు వెళుతున్న ఏం చేస్తున్న
ప్రతిచోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అధమరపైన పెదవుల పైన
ప్రతి మాట నువ్వే
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry


