Krediler
PERFORMING ARTISTS
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
Composer
Daasarathi Krishnamacharyulu
Songwriter
Şarkı sözleri
అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
కనులు చేపలై గంతులు వేసె
మనసు తోటలో మల్లెలు పూసె
దోసిట వలపుల పూవులు నింపీ
దోసిట వలపుల పూవులు నింపీ నీ కోసము వేచితి రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
చల్ల గాలితో కబురంపితిని
చల్ల గాలితో కబురంపితిని చందమామలో వెదకితి నోయీ
తార తారనూ అడిగితి నోయీ దాగెద వేలా? రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవా
నల్లని మేఘము జల్లు కురియగా
నల్లని మేఘము జల్లు కురియగా ఘల్లున ఆడే నీలినెమలినై
నిను గని పరవశమందెద నోయీ కనికరించి ఇటు రావోయీ
అందాల బొమ్మతో ఆటాడవాపసందైన ఈ రేయి నీదోయి స్వామీ
అందాల బొమ్మతో ఆటాడవా
Written by: Daasarathi Krishnamacharyulu, Dasarathi, S. Rajeswara Rao

