Şarkı sözleri

ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే కోపమా నా మీదే సొంతవాడితో పంతమెందుకే నా మనస్సును దూరంగ విసిరేయకే నేరమేం చేసిందే ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే కోపమా నా మీదే పెదాలపైన పదాలుకాని నిజాన్ని చూసాను నీ కళ్లలో యదంత నన్నే దాచావుగాని అబద్దమంటావు ఈ వేళలో అంతులేనంత ప్రేమంతా ఏదే ఇపుడు ఏ కొంచెమో కానరాదే నటనలు వదలవే నిన్నటిలా నువ్వు లేవే ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే కోపమా నామీదే వీడుకోలని నిన్ను వీడినా వాడిపోదులే యదలోని నీ సంతకం నువ్వు నా జీవితం (జీవితం) ఒంటి దారిలో జంట నీడగా తోడు ఉండదా ఇన్నాళ్ల నీ జ్ఞాపకం మరువదె నా ప్రాణం (ప్రాణం) అనుకుంటే అన్ని జరిగేదెలా, జరిగేదెలా నిజమయ్యే వీలే లేకున్నా నీ కలలో జీవించనా (జీవించనా) ఊరికే అలా ఊపిరాపకే ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే (జీవించినా) కోపమా నా మీదే (జీవించనా) (జీవించనా)
Writer(s): Ramajogayya Sastry, Gopi Sunder Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out