歌词
హరి ఓం...! హరి ఓం...! హరి ఓం...!
ఘనాఘన సుందరా... కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా... కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో
నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారము
పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా... కరుణా రసమందిరా
ప్రాభాత మంగళ పూజావేళ
నీ పద సన్నిధి నిలబడీ
నీ పదపీఠిక తలనిడీ
ప్రాభాత మంగళ పూజావేళ
నీ పద సన్నిధి నిలబడీ
నీ పదపీఠిక తలనిడీ
నిఖిల జగతి నివాళులిడదా
నిఖిల జగతి నివాళులిడదా
వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా... కరుణా రసమందిరా
గిరులూ ఝరులూ... విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే
నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ... విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే
నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా... భవహరా... పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా... కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా...
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ
Written by: Devulapalli Krishnasastri, Devulaplli Krishna Sastry, P. Adinarayana Rao


