制作

出演艺人
Ghantasala
Ghantasala
表演者
P. Susheela
P. Susheela
表演者
作曲和作词
S. Rajeswara Rao
S. Rajeswara Rao
作曲
C. Narayana Reddy
C. Narayana Reddy
词曲作者
Sri Sri
Sri Sri
词曲作者

歌词

ఏదో
ఏదో
ఏదో
ఏదో గిలిగింత
ఏమిటీ వింత
ఏమని అందును ఏనాడెరుగను
ఇంత పులకింత కంపించె తనువంత
ఏదో
ఏదో
ఏదో గిలిగింత
ఏమిటీ వింత
ఏమని అందును ఏనాడెరుగను
ఇంత పులకింత
కంపించె తనువంత
వలపు తలుపు తీసే
కమ్మని తలపు నిదురలేచే
వలపు తలుపు తీసే
కమ్మని తలపు నిదురలేచే
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే
ఏదో
ఏదో
కన్ను కన్ను కలిసే
బంగరు కలలు ముందు నిలిచే
కన్ను కన్ను కలిసే
బంగరు కలలు ముందు నిలిచే
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే
ఏదో
ఏదో
గానమైన నీవే
నా ప్రాణమైన నీవే
గానమైన నీవే
నా ప్రాణమైన నీవే
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే
ఏదో
ఏదో
నన్ను చేర రావే
నా అందాల హంస వీవే
నన్ను చేర రావే
నా అందాల హంస వీవే
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే
ఏదో
ఏదో
ఏదో గిలిగింత
ఏమిటీ వింత
ఏమని అందును ఏనాడెరుగను
ఇంత పులకింత
కంపించె తనువంత
ఏదో
ఏదో
Written by: C. Narayana Reddy, S. Rajeswara Rao, Sri Sri
instagramSharePathic_arrow_out

Loading...