制作
出演艺人
Harini
表演者
Yazin Nizar
表演者
Prashanth R. Vihari
表演者
作曲和作词
Prashanth R. Vihari
作曲
Ananta Sriram
词曲作者
歌词
సమయమా
అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా
మరింత హాయి పోగుజేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా
ఆ నింగి జాబిల్లిపై ఏ నీటి జాడున్నదో
నే చూడలేనే అపుడే
ఈ నేల జాబిల్లిపై సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే
తనే నా సగంగా
తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా
ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు
ఆ తారాతీరాలు, ఆనంద ద్వారాలు
విరిసి మురిసే వేళ, తీపి కురిసే వేళ
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా
Written by: Ananta Sriram, Prashanth R. Vihari

