制作
出演艺人
Kapil Kapilan
表演者
Haripriya
表演者
Devi Sri Prasad
表演者
Keerthy Suresh
演员
作曲和作词
Devi Sri Prasad
作曲
Shree Mani
词曲作者
歌词
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే భాష అయినది
కోరుకోని కొరికేదో తీరుతున్నది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగన్నది
అలలా నా మనసు తేలుతుందే
వలలా నువు నన్ను అల్లుతుంటే
కలలా చేజారిపోకముందే
శిలలా సమయాన్ని నిలపమందే
నడక మరిచి నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవిపైన నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగన్నది
మెరిసే ఒక కొత్త వెలుగు నాలో
కలిపే ఒక కొత్త నిన్ను నాతో
నేనే ఉన్నంత వరకు నీతో
నిన్నే చిరునవ్వు విడువదనుకో
చినుకు పిలుపు విని నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిలిపి మనసు చిందేసె ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది
ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగన్నది
Written by: Devi Sri Prasad, Shree Mani