歌词
కనుపాప నువ్వై వెలుగిస్తూ
నా కలకు రంగుల మెరుపిస్తూ
అడుగడుగు నీడై నడిపిస్తూ
ప్రతి మలుపులో నను గెలిపిస్తూ
అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా
పండుగై నిండవే లోపలా వెలుపలా
నువ్వు నా తోడై లేనిదే నేనెలా
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
తల నిమురు చేయి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలనా సాంత్వనా అన్ని నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవెనై నడపగా నిండు నూరేళ్లు
నా మొదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా
ఒక్క నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు
నన్నిలా పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరుజన్మలు నాకెదురుపడినా గాని
నీ ఒడి పాపగా నన్నుండనీమ్మా
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
(అమ్మా అమ్మా నీ వెన్నెల)
(నిత్యం నాపై ఉండాలిలా)
ఆ... అమ్మా
Written by: Radhan, Ramajogayya Sastry