音乐视频

音乐视频

制作

出演艺人
Chinmayi Sripaada
Chinmayi Sripaada
表演者
作曲和作词
Vishal Chandrashekar
Vishal Chandrashekar
作曲
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
词曲作者

歌词

(మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా)
ఎన్నిన్నాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్ని వైపులా వెనుతరిమే ఈ సంబరం
అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా
ఊహలోనే ఊయలూపి జారిపోకే సమయమా
తడబడే తలపుల తపన ఇదని తెలపకా
(మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా)
రా ప్రియా శశివదనా
అని ఏ పిలుపు వినబడెనా
తనపై ఇది వలనా
ఏదో భ్రమలో ఉన్నానా
చిటికే చెవిబడి తృటిలో మతి చెడి
నానా యాతన మెలిపెడుతుండగా
(గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మమగమాప
గరినిసాసా గరినిసాసా నిస నిస నిన పదనిస
గరినిసాసా గరినిసాసా మా మా మపనిదపమా)
నా ప్రతి అణువణువు
సుమమై విరిసే తొలి ఋతువు
ఇకపై నా ప్రతి చూపు
తనకై వేచే నవ వధువు
చెలిమే బలపడి రుణమై ముడిపడే
రాగాలాపన మొదలవుతుండగా
(మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా)
Written by: Sirivennela Sitarama Sastry, Vishal Chandrashekar
instagramSharePathic_arrow_out

Loading...