制作

出演艺人
Veturi Sundara Ramamurthy
Veturi Sundara Ramamurthy
表演者
S. Janaki
S. Janaki
声乐
Rajan Nagendra
Rajan Nagendra
表演者
作曲和作词
Rajan Nagendra
Rajan Nagendra
作曲

歌词

లేత చలిగాలులు
దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు
దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగలేవులే
లేత చలిగాలులు
దోచుకోరాదురా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవదలకు నా హ్రుదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు
కలల భాష్యాలు
వలపుగా సాగి
వలలుగా మూగి
కాలాన్ని బంధించగా
లేత చలిగాలులు
దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు
దోచుకోలేవులే
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల
మధురరాగాల
చిగురు సరసాల
నవవసంతాల
విరిలెన్నో అందించగా
లేత చలిగాలులు
దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగలేవులే
Written by: Rajan–Nagendra, Veturi Sundara Ramamurthy
instagramSharePathic_arrow_out

Loading...