歌词
నీ కంటి చూపులు
అల్లుకుంటే తీగలు
మనసు నమ్మదుగా హో
మనసు నమ్మదుగా
నా కంటి పాపకు
నువ్వే కల అయ్యెను
నువు లేక నేనే లేనుగా హో
నువు లేక నేనే లేనుగా
ఏమనను నిను ఏమనను
ఈ జీవితమే నీది నిజం
ప్రాణమా ఓ ప్రాణమా
ఈ కథలో మన ఈ కథలో
మది గొంతు దాటుకొని చెప్పమని
ప్రాణమా ఓ ప్రాణమా
ఇదేగా ప్రేమ ప్రేమగా
నీ మీద నాకు ప్రేమ చేరగా
నీ కోసమే ఈ జన్మని
రాసా తరాలు మారినా
ఇదేగా ప్రేమ ప్రేమగా
నీ మీద నాకు ప్రేమ చేరగా
నీ కోసమే ఈ జన్మని
రాసా తరాలు మారినా
నీ వెంట నేననే
నీ చెంత చేరితే
మనసాగదు ఊహే తెలుసా
హో నవ్వే పెదాలనే తాకే క్షణాలివే
సరిపోవని చూస్తున్నా
నడవమను నడవమను
నీ వెనకపడే నా అడుగులను
ప్రాణమా ఓ ప్రాణమా
ఇదేగా ప్రేమ ప్రేమగా
నీ మీద నాకు ప్రేమ చేరగా
నీ కోసమే ఈ జన్మని
రాసా తరాలు మారినా
నీ కంటి చూపులు
అల్లుకుంటే తీగలు
మనసు నమ్మదుగా హో
మనసు నమ్మదుగా
నా కంటి పాపకు
నువ్వే కల అయ్యెను
నువు లేక నేనే లేనుగా హో
నువు లేక నేనే లేనుగా
నువ్వుంటే చాలుగా సొంతంగా మారంగా
ఇంకొక జన్మే ఎందుకో
నాకన్న నీ పైనే
ప్రేమెట్ట పొంగిందో
ఆరాటమంతా చేరునో
స్వప్నమిదే తొలి స్వప్నమిదే
నేల ఆకాశం కలిసే
ప్రధమ ప్రయాణమా
ఓ ప్రాణమా
ఇదేగా ప్రేమ ప్రేమగా
నీ మీద నాకు ప్రేమ చేరగా
నీ కోసమే ఈ జన్మని
రాసా తరాలు మారినా
ఇదేగా ప్రేమ ప్రేమగా
నీ మీద నాకు ప్రేమ చేరగా
నీ కోసమే ఈ జన్మని
రాసా తరాలు మారినా
Written by: Kittu Vissapragada, Sachin-Jigar


