制作
出演艺人
Laxmi
表演者
作曲和作词
Thirupathi Matla
作曲
歌词
తిన్నా తిరం పడుతలే
కూసున్న తిరం పడుతలే
ఏడున్న తిరం పడుతలే
ఎవలున్న తిరం పడుతలే
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
నువ్వు సిర్రా సిటుక బట్టి
డప్పుల్లా దరువులేస్తే
తనువంత తాట కలిసే
ప్రేమ ఇత్తునాలు మొలిసే
గప్పటి నుండే నాకు
తిప్పలు మొదలాయెనుల్ల
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
నువ్వు నేను దూరమాయి ఏడాదినరుదమోయి
పొదుమాపు ఎదురుసూపు జాడన్న తెలువదోయి
గిట్ల గోసలు పెట్టా
నీకు ఎట్లా మనసాయే పిలగా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
రవ్వంత గోసులాట అగ్గోలే రాసుకుంది
ఇక మాట మాట పెరిగే
ఇద్దరి మనసు ఇరిగే
కొవ్వత్తివోలె కరిగే
కోపాలు ఎందుకోయి పిలగా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
పసిదాన్ని కాదా నేను
పగవట్టబోకు నన్ను
పంతాలు ఇడుసబెట్టు
ఇకనన్న సేయి బట్టు
నా గుండెల భాధ
నీ గుండెకు గురుతొస్తలేదా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
బాధైతుందే నీ యాదిలో మనసంతా
మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా
Written by: Thirupathi Matla

