制作
出演艺人
Ranjith
表演者
Sri Rama Chandra
表演者
Karthik
表演者
作曲和作词
Mickey J Meyer
作曲
Sirivennela Sitarama Sastry
词曲作者
歌词
ఆకాశం విరిగినట్టు, కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ, ఆటంకాలొడుపుగ దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం, వేరే జరగడం
సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం, ఎన్నో అడగడం
ఎపుడూ తెమలని రాద్దాంతం
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏమందాం? మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం? తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు, కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ, ఆటంకాలొడుపుగ దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
Follow పదుగురి బాట
बोलो నలుగురి మాట
లోలో కలవరపాటా
దాంతో గడవదు పూట
ఇటా ఆటా అని ప్రతొక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇటే అని ప్రమాణపూర్తిగ తెగేసి చెప్పేదెలాగరా
ఇది గ్రహించినారీ మహాజనం, ప్రయాస పడి ఏం ప్రయోజనం
సిమెంటు భూతల సహారెడారిది, నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏమందాం? మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం? తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఎన్నో పనులను చేస్తాం
ఏవో పరుగులు తీస్తాం
హ్మూహూ సతమతమౌతాం
ఓహో బతుకిదే అంటాం
ఆటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫానో తరిమిన ప్రతిక్షణం
ఇది పుటుక్కు జరజర డుబుక్కు మే, అడక్కు అది ఒక రహస్యమే
ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా
ఏం చేద్దాం? అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం? మునుముందేముందో తెలియని చిత్రం
ఏమందాం? మననెవరడిగారని ఏమని అంటాం
ఏం విందాం? తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు, కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ, ఆటంకాలొడుపుగ దాటుకుంటూ
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
Written by: Mickey J Meyer, Sirivennela Sitarama Sastry