制作
出演艺人
S. P. Balasubrahmanyam
表演者
作曲和作词
Mickey J Meyer
作曲
Sirivennela Sitarama Sastry
词曲作者
歌词
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో
నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే
విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా
అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే
కాలం మనలాగా
ఒక నిమిషం కూడా
ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేస్తుంది
వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు
వివరించే రుజువేముంది
సుడిలో పడు ప్రతి నావ
చెబుతున్నది వినలేవా
పొరబాటున చెయిజారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను
రగిలే రవి తపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా
కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని
అని తిరగేశాయా చరిత పుటలు
వెనుచూడక ఉరికే జతలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు
అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధిరాత
అనుకోదేం ఎదురీత
పది నెలలు తనలో
నిన్ను మోసిన అమ్మైనా
(అమ్మైనా)
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే
విరిసే కొమ్మైనా
(కొమ్మైనా)
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా
అనుకుంటే అతిసులువా
పొరపడినా పడినా జాలిపడదే
కాలం మనలాగా
ఒక నిమిషం కూడా
ఆగిపోదే నువ్వొచ్చేదాకా
Written by: Mickey J Meyer, Sirivennela Sitarama Sastry

