制作
出演艺人
库马·山奴
表演者
作曲和作词
Vandemataram Srinivas
作曲
Chinni Charan
词曲作者
歌词
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓవింత కవ్వింత నీకంత చొరవా
ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
శ్రీరంగా, నిను కోరంగా, ఈ గిలిగింతలు చలిలో చమటలు
గారంగా నువు చేరంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు
దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా
పాపలయ్యి పాడుకుందామా చేపలల్లే ఈదుకుందామా
గుండె బావి తొడుకుందామా ఈడు దాహం తీర్చుకుందామా
నీళ్లలోనే మనముంటున్నా తీరని దాహాలేంటమ్మా
ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
వేసవిలో నిను చూస్తుంటే చలివేస్తున్నది చెలి ఏంటే ఇది
వేకువలో నువులేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది
దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా
తాజమహల్ చేరుకుందామా love గజల్ పాడుకుందామా
తారలన్నీ తెంచుకుందామా తోరణాలే కట్టుకుందామా
ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా meet-ey అవుదామా
ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓవింత కవ్వింత నీకంత చొరవా
ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా
Written by: Chinni Charan, Vandemataram Srinivas

