制作

出演艺人
Shankar Mahadevan
Shankar Mahadevan
表演者
Suchitra
Suchitra
表演者
作曲和作词
Thaman S.
Thaman S.
作曲
Shree Mani
Shree Mani
词曲作者

歌词

ఒంటరేళ్ళ తుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు
గండుచీమలాగ నన్ను కుట్టినాడు
బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు
బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు
చందనాల చక్కలాంటి చక్కనైన పిల్లా
చాందినీల చుక్క సిగ్గుచెక్కిపొతే ఎల్లా
చంపకేసి అద్ధ ముద్దు పావడాల పిల్లా
చేతిలోంచి జారిపోకే ఓసి సబ్బు బిళ్ళా
నేతి అరిసెలా మూల బరిసెలా
సానబట్టి సూది కళ్ళు గుండెలోన గుచ్చమాకలా, గుచ్చమాకలా, గుచ్చమాకలా
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి
గుంజుకుంటే గింజుకోవా ఆశలన్నీ
పాతికేళ్ళ మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు
చేసుకోవే జిల్లుమన్న దిల్లు బొణి
పావుగంట కౌగిలిస్తే తియ్యగా
హెయ్ పావుసేరు తేనెకైన అంత తీపి లేదుగా
ఎక్కడో తళుక్కుమంది పిల్లగా
హెయ్ పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా
లేడి కళ్ళ చిన్నదాన్ని వాడి చూపులేసి ప్రేమతోటి కుట్టినావుగా
గాజుబొమ్మలాంటి దాన్ని జారిపోనివ్వకుండ ప్రాణమేసి పట్టినావుగా
సిగ్గుపడకలా
నెగ్గిన్నావే పిల్లా
చిలిపి చిలకల కలికి కులుకుల
జారుతున్న దోర గుండె కోరి కోరి కొరకమాకలా, కొరకమాకలా, కొరకమాకలా
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి
గుంజుకుంటే గింజుకోవా ఆశలన్నీ
పాతికేళ్ళ మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు
చేసుకోవే జిల్లుమన్న దిల్లు బొణి
इक ढोल ढोल ढोल ढोलना
పరికిణీల చందమామ పరిణయం కోరినా
इक ढोल ढोल ढोल ढोलना
చుక్క లాంటి చక్కనమ్మ బుగ్గ చుక్క అడిగినా
పొయ్యి మీద పాలకుండ పొంగి పొరలి పోయె
పండగేదో ముందరుందనా
పక్కమీద సన్నజాజి పువ్వులే జల్లే
సంగతేదో సణుగుతోందనా
సొగసు సంకెల విసరకే పిల్లా
కొసరు నడుముతో ఎసరు ముసరగా
ఆ తస్సాదియ్య కస్సుమన్న కన్నెతోడు కన్నుకొట్టగా, కన్నుకొట్టగా, కన్నుకొట్టగా
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి
గుంజుకుంటే గింజుకోవా ఆశలన్నీ
పాతికేళ్ళ మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు
చేసుకోవే జిల్లుమన్న దిల్లు బొణి
Written by: Shree Mani, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...