歌詞
పరం పవిత్రం బాబా విభూతిం
పరం విచిత్రం లీలా విభూతిం
పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం
బాబా విభూతిమ్ ఇధమ్ ఆశ్రయామి
వినిపించన విభూది మహిమ వివరించన వేదాంత గరిమ

ఆరక వెలిగే ఆ ధుని లోన అమరివున్నది అమృత మధురిమ

భవరోగముల బాపే భవ్యౌషధము
భవరోగముల బాపే భవ్యౌషధము
సకల శుభములొసగే సంపత్కరము
సకల శుభములొసగే సంపత్కరము
ఆపదల తొలగించి ఆదరించును
ఆపదల తొలగించి ఆదరించును
రక్ష కవచముగ రాజిల్లును రక్ష కవచముగ రాజిల్లును
షిర్డీ సాయి అందించే వరప్రసాదము అవనీ జనులకిది అభయప్రదము
వినిపించన విభూది మహిమ వివరించన వేదాంత గరిమ
పంచభూతాత్మకమై పరుగుచున్న దేహము
పంచభూతాత్మకమై పరుగుచున్న దేహము
చివరకు మిగులునది చిత భస్మము
చివరకు మిగులునది చిత భస్మము
ఈసత్య మందరికి యెరుక పరచగా
ఈసత్య మందరికి యెరుక పరచగా
బ్రతుకు అశాశ్వతమని ప్రకటించగా
బ్రతుకు అశాశ్వతమని ప్రకటించగా
బూదిని అనుగ్రహించి బోధించెను తత్వము తెలిపి ధన్యత కూర్చెను
వినిపించన విభూది మహిమ వివరించన వేదాంత గరిమ
వినిపించన విభూది మహిమ వివరించన వేదాంత గరిమ
ఆరక వెలిగే ఆ ధుని లోన అమరివున్నది అమృత మధురిమ
ఆరక వెలిగే ఆ ధుని లోన అమరివున్నది అమృత మధురిమ
వినిపించన విభూది మహిమ వివరించన వేదాంత గరిమ
Written by: M S Madhukar, V. B. Sai Krishna Yachendra