音樂影片

積分

出演艺人
Raghu Kunche
Raghu Kunche
表演者
Naga Swarna
Naga Swarna
表演者
Sahithi
Sahithi
表演者
作曲和作词
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja
作曲
Sahithi
Sahithi
词曲作者

歌詞

వోణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి ఆటే దాగుడుమూత తన పాటే కోయిల కూత మనసే మల్లెల పూత ఆ పరువం దోచుకుపోతా రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి అచ్చిక బుచ్చికలాడుకుంటూ కలుసుకోవాలి వెచ్చగా వెచ్చగా వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే అందమిది అందమిది వచ్చే పందెంకోడిలా పొంగినది పొంగినది పచ్చి పాల ఈడులా సందెపొద్దు వేళలోన సన్నజాజి పువ్వులా అందమంత ఆరబోసి నీకు హారతివ్వనా పంచె పంచె వలపే నా మనసులోని పులుపే ఆశ పడ్డ తలపే నా ఎదలో మోజు తెలిపే ఇంతకుమించి ఇంతకుమించి ఏదో ఏదో ఉందిలే కలికి కులుకు తళుకుబెళుకులొలుకుతున్నాది ఆ చిలక బుగ్గ మొలక మొగ్గ విచ్చుకున్నాది కన్నె ఇది కన్నె ఇది కన్ను కొట్టమన్నది వన్నె ఇది వన్నె ఇది వెన్ను తట్టమన్నది పరికిణి కట్టుకొచ్చేను పరువాల జాబిల్లి పదునైన సోకుగని ఎదకేదో ఆకలి కనులు పాడే జోల ఇది దేవలోక బాల కలలు కనే వేళ ఇది కలువ పూల మాల ఏటవాలు చూపులేసి లాగింది నా గుండెని కంది చేను చాటుకొస్తే కలుసుకుంటాలే ఈ అందగాడి ఆశలన్ని తెలుసుకుంటాలే వోణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి ఆటే దాగుడుమూత తన పాటే కోయిల కూత మనసే మల్లెల పూత ఆ పరువం దోచుకుపోతా ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి అచ్చిక బుచ్చికలాడుకుంటూ కలుసుకోవాలి వెచ్చగా వెచ్చగా వయసు విచ్చెను పుచ్చుకుపోరా కమ్మగా రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
Writer(s): Yuvanshankar Raja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out