積分

演出藝人
King Johnson Victor
King Johnson Victor
演出者
Pradeep
Pradeep
演員
詞曲
King Johnson Victor
King Johnson Victor
作曲

歌詞

దేవుని ఆకలి తీర్చేదేవరు
ఈ మనిషికి ఆకలి తీర్చింది ఎవరు
ఆ దేవునికి ఆకలి ఉందా
ఈ మనుషులు పెడితే అది తీరుతుందా
తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి
నీకిచ్చిన పిల్లల తనకివ్వాలి ఇవ్వవా సువార్తకి
మనిషికి ఆకలి తీరింది ఆ దేవునికే పస్తే మిగిలింది
దేవుని ఆకలి తీర్చేదేవరు
ఈ మనిషికి ఆకలి తీర్చింది ఎవరు
తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది
తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది
తన పిల్లలు వస్తే తల్లి కడుపు నిండుతుంది
తల్లివి కాదంటే తల్లి కడుపు మండుతుంది
తన కలలను పండించాలని పగలే ఉంది
నువ్వు నిదురే పోవాలని రాత్రే ఉంది
మనిషికి నిదురే తీరింది తన కంటికి కునుకే రాకుంది
దేవుని ఆకలి తీర్చేదేవరు
ఈ మనిషికి ఆకలి తీర్చింది ఎవరు
తన ఆకలి తీర్చే తన తనయుడు రావాలి
తన మాటలు చెప్పే ఆపోస్తలులే కావాలి
తన ఆకలి తీర్చే తనయులు రావాలి
తన మాటలు చెప్పే మనమే రావాలి
తన కొరకే ప్రాణం పెట్టే పిల్లలు ఏరి
తన కొరకే పెళ్లి వద్దనే మనుషులు ఏరి
మనిషికి కోరిక తీరింది తన పిల్లలు రారని తెలిసింది
దేవుని ఆకలి తీర్చేదేవరు
ఈ మనిషికి ఆకలి తీర్చింది ఎవరు
ఆ దేవునికి ఆకలి ఉందా
ఈ మనుషులు పెడితే అది తీరుతుందా
తెలియని ఆహారం తనకుంది ఇవ్వవా అతనికి
నీకిచ్చిన పిల్లల తనకివ్వాలి ఇవ్వవా సువార్తకి
మనిషికి ఆకలి తీరింది ఆ దేవునికే పస్తే మిగిలింది
దేవుని ఆకలి తీర్చేదేవరు
ఈ మనిషికి ఆకలి తీర్చింది ఎవరు
Written by: King Johnson Victor
instagramSharePathic_arrow_out

Loading...