積分
演出藝人
Sid Sriram
演出者
詞曲
Kittu Visupragada
詞曲創作
Sanjeev Thomas
編曲
歌詞
మనస్సే చేజారే నీవల్లే
పతంగైయిపోయిందే నీవెంటే
ఇదంతా కల కాదా
అనిపించే ఏమో నమ్మాలో ఓ లేదే
మెరుపే మగువై ఎదురే పడితే
మనసే కరిగే మేఘంలో దాహంలా
వెనకపడే వేగం పెరిగిన ఈ నిమిషంలో
తరగతిలో తనగతిలో మలుపులనే
మది చదివే
మనసారా మనసారా పలికిందే నా ప్రాణం
నిను కోరే నాతో జతగా
కిరణంతో చిగురైనా శిశిరంలా
జగమే మారే మారే
కథలో ముల్లే చేరే
ఇకపై అన్నీ నీకే
నాదంటూ ఏమున్నా
ఎపుడూ అనుకోలేదే
మునుపు ఏదో రోజే
ఒకరు నాతో తోడే వస్తారంటూ
ఎద లోతులో నీపై ప్రేమని
పెదవంచులో మోస్తూ ఉన్నాగాని
ఒక మాటలో తెలపాలనుకున్నా
భాష కాదంటుందో లేదో
స్పర్శతో మౌనాన్ని తాకే
యుద్దమే నాలో చేస్తూ ఉన్నా ఓ
అంతులేని ఆ సాగరంలా
హద్దులేని నీలాకశంలా
గుండెలోని ఈ ప్రేమనంతా
రాసివ్వనా నీ పేర
అంతులేని ఆ సాగరంలా
హద్దులేని నీలాకశంలా
గుండెలోని ఈ ప్రేమనంతా
రాసివ్వనా
కాలమే మననే చూసి
ఓ క్షణం ఆగేనా
నిన్నతో రేపటి కోసం
దిష్టినే తీసేనా
నాకు నువ్వుంటే చాలు
నీకు నేనున్నాగా
లోకమంతా ఇలాగే ఏకమౌతున్నా
వీడిపోని నదీ అలల్లా ఉంటూ కడదాగా
మనస్సే చేజారే
పతంగైయిపోయిందే
ఇదంతా కల కాదా
లలాల లాలాల
మెరుపే మగువై ఎదురే పడితే
మనసే కరిగే మేఘంలో దాహంలా
వెనకపడే వేగం పెరిగిన ఈ నిమిషంలో
తరగతిలో తనగతిలో మలుపులనే
మది చదివే
మనసారా మనసారా పలికిందే నా ప్రాణం
నిను కోరే నాతో జతగా
కిరణంతో చిగురైనా శిశిరంలా
Written by: Kittu Visupragada, Sanjeev T