歌詞
నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
కన్నోదిలి చూపు వెళ్ళిపోతుందా
వేకువనే సందె వాలిపొతోందే
చీకటిలో ఉదయం వుండి పొయిందే
నా యదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవొద్దే పోవొద్దే ప్రేమా
నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
కన్నోదిలి చూపు వెల్లిపోతుందా
ఇన్నినాళ్ళు నీ వెంటే
సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటుందే
నిన్న దాక నీ రూపం
నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తుందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే
జాలి లేని విధి రాతే శాపమైనదే
మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటె
కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవొద్దే పోవొద్దే ప్రేమా
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవొద్దే పోవొద్దే ప్రేమా
Written by: Vanamali, Yuvan Shankar Raja