Kredity
PERFORMING ARTISTS
Ghantasala
Performer
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
Composer
Texty
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే
మనసాడెనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను
నెనరూ కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింతా
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక
తిరిగాడును తేనెటీగ తీయ్యదనము కోరి అనురాగాలా తేలి
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎదలో ఇంతటి సంతోషమెందుకో
ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలూ కోరికలూ తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
సాహిత్యం: ఆరుద్ర: దేశద్రోహులు: ఎస్. రాజేశ్వరరావు: ఘంటసాల, సుశీల
Written by: S. Rajeswara Rao