Texty

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరె రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగొనె రావణు చెల్లి ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయె మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఆ నాథ రఘునాధా పాహి పాహి పాహి అని అశోకవననిని శోకించే సీత పాహి అని అశోకవననిని శోకించే సీత దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకొని పావని ఆ జనని శిరోమణి అందుకొని పావని లంక కాల్చి రాముని కడకేగెను రివ్వు రివ్వు మని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి అతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పలికె చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి అయోనిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి రామ సుగుణధామా రఘువంశజలధిసోమా శ్రీరామా సుగుణధామా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా శ్రీరామా సుగుణధామా మందస్మిత సుందర వదనారవింద రామా ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా మందార మరందోపమ మధురమధురనామా మందార మరందోపమ మధురమధురనామా శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా. శ్రీరామా సుగుణధామా అవతారపురుష రావణాధి దైత్యవిరామా నవనీత హృదయ ధర్మ నిరతరాజలరామా పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా సీతామనోభిరామా సాహిత్యం: కొసరాజు
Writer(s): Samudrala Sr, Ghantashala Ghantashala Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out