Texty

నీవేనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది నీవేనా నామదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా... నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది నీవేలే నామదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేలే... కలలోనే ఒక మెలకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవ మాయో తెలిసి తెలియని అయోమయములో నీవేనా ననుతలచినది నీవేనా ననుపిలిచినది నీవేనా నామదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా... కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి కనులను మనసును కరగించి మైమరపించి నన్నలరించి నీవేలే నను తలచినది నీవేలే నను పిలిచినది నీవేలే నామదిలో నిలచి హృదయం కలవరపరచినది నీవేలే... నీవేలే...
Writer(s): Pingali, N/a Ghantasala Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out