Musikvideo

Musikvideo

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Lead Vocals
COMPOSITION & LYRICS
Acharya Athreya
Acharya Athreya
Songwriter
M. S. Viswanathan
M. S. Viswanathan
Composer

Songtexte

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్ళు
వీళ్లేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకేపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
తళతళ మెరిసేటి కళ్లు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముళ్ళు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు
దులిపేయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసేయ్ పాతసంకేళ్ళు
మనషులె మననేస్తాలు come on clap
మనసులే మన కోవెలలు everybody
మనషులె మననేస్తాలు
మనసులే మన కోవెలలు
మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్డులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
Come on everybody join together
Written by: Athreya, M. S. Viswanathan
instagramSharePathic_arrow_out

Loading...