Musikvideo

Musikvideo

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Lead Vocals
P. Susheela
P. Susheela
Lead Vocals
COMPOSITION & LYRICS
K. Chakravarthy
K. Chakravarthy
Composer
Veturi
Veturi
Songwriter

Songtexte

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే
నీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం
త్యాగాలమయమై సంసార బంధం
నీ చేయి తాకి చివురించే చైత్రం
ఈ హస్తవాసే నాకున్న నేస్తం
అనురాగ సూత్రం
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే
మీ కంట తడిని నే చూడలేను
మా అమ్మ నీవై కనిపించినావు
ఈ బొమ్మనెపుడో కదిలించినావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీకదీపం
దైవాలకన్నా దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే
మీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
Written by: K. Chakravarthy, Veturi
instagramSharePathic_arrow_out

Loading...