Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
P. Susheela
P. Susheela
Performer
K. Chakravarthy
K. Chakravarthy
Performer
Mickey J Meyer
Mickey J Meyer
Remixer
COMPOSITION & LYRICS
K. Chakravarthy
K. Chakravarthy
Composer
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Songwriter

Songtexte

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో... రావమ్మో
ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట, వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ
చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు
ఆకళ్ళకుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు
నీ కళ్ళు సోక నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలి పాట
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు, నే కోరిన మూడు ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు, నే కోరిన మూడు ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ ఏరు తోడు
ఏరెండినా ఉరు తోడు
నీ తోడులో ఊపిరాడు
ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో... రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా
Written by: K. Chakravarthy, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out

Loading...