Credits

PERFORMING ARTISTS
Sagar
Sagar
Performer
Sumangali
Sumangali
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Songtexte

ఏదో ప్రియా రాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమ ఎ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాల్ అనుకుంటున్నా
ఇటుపైన ఏ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటె
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయ్యని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం
ఓహ్ పాట పాడగ మౌనం పురి విప్పి ఆడదా ప్రాణం
అడవినైనా పూదోట చేయద ప్రేమబాటలో పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలద స్వర్గం
ఎల్లదాటి పరవల్లు తొక్కడ వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమ నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాట వేధం
నువ్వుంటే ప్రతి పలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
Ha-aah, ha-aah
Ha-aah, ha-aah
Ha-aah, ha-aah
Ha-aah, ha-aah
Ha-aah, ha-aah, aah-aah
ఓహ్ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగెన
మునిగి తెలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీ వల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమ ఓ ప్రేమ ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటు రాదే
నువ్వుంటే వెలుగంటు పోదే
నువ్వుంటే మరీ మాటలు కూడా పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటు లేదే
నువ్వుంటే అలుపంటు రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే
Written by: Chembolu Seetharama Sastry, Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...