Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Vijay Anthony
Vijay Anthony
Performer
COMPOSITION & LYRICS
Vijay Anthony
Vijay Anthony
Composer
Sirivennela Seetharama Shastry
Sirivennela Seetharama Shastry
Songwriter

Lyrics

రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆ చరిత... కర్మ యోగమే జన్మంతా ధర్మ క్షేత్రమే బ్రతుకంతా సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాతా. మనలాగే ఓ కన్న తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి సత్యా హింసల మార్గాజ్యోతి. నవశకానికే నాంది. రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.ఆ సిసలైన జగజ్జేత చరకా యంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి నూలుపోగుతో మదపటేనుగుల బంధించాడుర జాతిపిత ఆ సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చాభానుడి ప్రభాత క్రాంతి పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి. ఇలాంటి నరుడొక డిలాటలంపై నడియాడిన ఈనాటి సంగతి నమ్మ రాదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి సర్వజన హితం నా మతం అంటరానితనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం.హే రాం... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Writer(s): Sirivennela Seetha Rama Shastry, Vijay Antony Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out