Music Video

Em Chessavo
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
S.P. Charan
S.P. Charan
Performer
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Suddhala Ashok Teja
Suddhala Ashok Teja
Songwriter

Lyrics

ఏం చేసావో నా మనసు నీదైపోయింది ఏదేమైనా నిను వదలి రానని అంటుంది ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది నిను చేరి జతగా ఆడానా సరదాల కేళి ఇక చూడు రోజూ అయిపోదా సరసాల హోలీ నీ ఆలనలో నీ లాలనలో ఇక నాకన్నా మహరాణి వేరే ఉందా ఏం చేసావో నా మనసు నీదైపోయింది ఏదేమైనా నిను వదలి రానని అంటుంది ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది పాపాయల్లె నా ముందు కుదురుగ కూర్చుంటే పుత్తడిబొమ్మగ నిను దిద్ది దిష్టే తియ్యనా పిల్లాడల్లె అల్లరిగా పరుగులు తీస్తుంటే కళ్ళను మూసి నలుగెట్టి లాలలు పోయనా నువ్ నడిచి అలిసిపోతుంటే అర చేతుల నిను మోసేను నువ్ కధలు చెప్పమని అంటేNమన కధనే వినిపిస్తాను ఏ చింతా లేదంటా నీ చెంతనుంటే ఏ భాగ్యం కావాలి నాకింతకంటే ఈ దొరసాని, నా అలివేణి ఇక లోకంలో ఏదైనా పోతేపోనీ ఏం చేసావో నా ప్రాణం ఏదేమైనా జీవితమే స్వాతీ చినుకుల మూత్యాలే దోసిలిలో నింపి మురిపెము తీర నీపైన ముద్దుగ జల్లనా చిరుమేఘంలొ ఏడేడు రంగులనే తెచ్చి మరునిమిషంలో నీ చేయి గాజులు చేయనా కనురెప్పలాగ నేవుంటే కనుపాపై నిదరోతాను మునిమాపువేళ చలివేస్తే నిను అల్లుకుపోతా నేను అమవాసలు లేవంటా నీవెదుట ఉంటే అమ్మల్లే తినిపిస్తా అలిగినావంటే ఓ స్నేహితుడా నా సహచరుడా ఇక నూరేళ్లు నువ్వే నా తోడూ నీడా ఏం చేసావో నా మనసు నీదైపోయింది ఏదేమైనా నిను వదలి రానని అంటుంది ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది ఏదేమైనా జీవితమే నీదని చెబుతుంది నిను చేరి జతగా ఆడానా సరదాల కేళి ఇక చూడు రోజూ అయిపోదా సరసాల హోలీ నీ ఆలనలో నీ లాలనలో ఇక నాకన్నా మహరాణి వేరే ఉందా
Writer(s): Suddhala Ashok Teja, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out