Music Video

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
S. V. Krishna Reddy
S. V. Krishna Reddy
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే మంత్రి నువ్వే, సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే మంత్రి నువ్వే, సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపొస్తున్నా, కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే మంత్రి నువ్వే, సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే బలము నువ్వే, బలగం నువ్వే ఆటా నీదే, గెలుపూ నీదే నారు నువ్వే, నీరు నువ్వే కోతా నీకే, పైరూ నీకే నింగిలోన తెల్లమేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టుపైనా పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే మంత్రి నువ్వే, సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే మంత్రి నువ్వే, సైన్యం నువ్వే పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే
Writer(s): Chandrabose, S.v.krishna Reddy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out