Créditos

ARTISTAS INTÉRPRETES
Karthik
Karthik
Intérprete
Chinmayi Sripaada
Chinmayi Sripaada
Intérprete
COMPOSICIÓN Y LETRA
Deva
Deva
Composición
A. M. Ratnam
A. M. Ratnam
Autoría

Letra

మేఘం కరిగెను (తకచిక తకజిన)
మెరుపే మెరిసెను (తకచిక తకజిన)
చినుకులు చిందెను (తకచిక తకజిన)
హృదయం పొంగెను
మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే
మేఘం కరిగెను (తకచిక తకజిన)
మెరుపే మెరిసెను (తకచిక తకజిన)
చినుకులు చిందెను (తకచిక తకజిన)
హృదయం పొంగెను (తకచిక తకజిన)
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది
కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ... నీ గోల... నా ఎదలో... పూమాల
మేఘం కరిగెను (తకచిక తకజిన)
మెరుపే మెరిసెను (తకచిక తకజిన)
మావయ్య రా... రా... రా... నా తోడు రా... రా... రా
నా తనువు నీకే సొంతమురా
ఒళ్ళంతా ముద్దులాడి పోరా
వయ్యారి రా... రా... రా... ఊరించ రా... రా... రా
నీ ఆశ బాసలు వింటా రా
నీ మురిపెం తీర్చి పంపుతా రా
తుమ్మెదలా రెక్కలు దాల్చి విహరించ రావయ్యా
కమ్మంగా తేనెలు గ్రోలి పులకించి పోవయ్యా
వలపుల బంధం వయసుకు అందం మల్లి మల్లి వల్లిస్తా
ఇరవయిరెండు ప్రాయంలోనే కాలాన్నాపేస్తా హోయ్!
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది
కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ... నీ గోల... నా ఎదలో... పూమాల
మన్మధా రా... రా... రా... మత్తుగా రా... రా... రా
మనసులో బాణం వేసేయిరా మల్లెల జల్లు చల్లిపోరా
వెన్నెలా రా... రా... రా... వెల్లువై రా... రా... రా
నీ అందం ఆరాధిస్తా రా
ఆనందం అంచు చూపుతా రా
అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా
బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా
తనువున తాపం, మనసున మోహం ప్రేమతో తీర్చేస్తా
ఎన్నటికైనా ఎప్పటికైనా నీ వరుడే నేనౌతా హోయ్!
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది
కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియ... నీ గోల... నా ఎదలో... పూమాల
మేఘం కరిగెను (తకచిక తకజిన)
మెరుపే మెరిసెను (తకచిక తకజిన)
చినుకులు చిందెను (తకచిక తకజిన)
హృదయం పొంగెను
మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే
Written by: A. M. Ratnam, Deva
instagramSharePathic_arrow_out

Loading...