Créditos

ARTISTAS INTÉRPRETES
Harris Raghavendra
Harris Raghavendra
Intérprete
Sujatha
Sujatha
Intérprete
COMPOSICIÓN Y LETRA
Mani Sharma
Mani Sharma
Composición
Suddhala Ashok Teja
Suddhala Ashok Teja
Autoría

Letra

చిత్రం: రాఘవేంద్ర (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా...
అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా...
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా...
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక...
నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే...
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో ఓ ఓ ఓ
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా...
సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా...
ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ...
నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు
నీ కంటిబొమ్మల విరుపు నీచుల పై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా...
పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే...
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే
నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం
Written by: Mani Sharma, Suddhala Ashok Teja
instagramSharePathic_arrow_out

Loading...