Lirik

భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చా పోలేక ఉండలేక కంటినీరై నిలిచావా ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటివచ్చావా అడుగడుగున బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా కన్న తల్లి చేతి ముద్ద నెలపాలే చేశావా అమ్మ కన్న మిన్న లేదు అన్న మాటే మరిచావా చదువులకే చదువై నిలిచి అమ్మ కంటి వెలుగై నిలిచి Pound-uల్లో power-e చూసి Londonన్ని loveఎ చేసి కన్నోళ్ళ తోడే విడిచి కని పెంచిన ఊరే విడిచి नेसताల స్నేహం విడిచి నీ మట్టికి దూరం నడిచి పై చదువుల కోసం నువ్వు పయనం అయ్యి వచ్చావా నీ మేధకు సమాధి కట్టే మోసానికి బలి అయ్యావా ప్రాణమల్లే వున్న చదువుని Part time లా మర్చావా బాధల్లో ఉన్నాగాని బాగున్నానని అన్నవా అవకాశాలెన్నోవున్నా నీకోసం చుస్తూ వున్నా అందనిదే గొప్పని నమ్మి ఆస్తి పాస్తులన్ని అమ్మి ఊహల్లో మేడలు కట్టి Foreign లో అడుగే పెట్టి పరువంత పక్కన పెట్టి కూలీల వేషం కట్టి అవమానాలెన్నో మోస్తూ అన్ని చేస్తూ ఉన్నావా జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా ఎండమావి నీళ్ల కోసం ఎడారిలోన వేతికావా ముళ్ల దారిలోన నువ్వు గామయ్యి నిలిచావా రక్తాన్నే పంచిన తల్లి రాఖిని కట్టిన చెల్లి నువ్వు ఆడి పాడిన గల్లి చూస్తున్నది నీకై మళ్లీ ఎదిగొచ్చిన బిడ్డల కోసం ఎద నిచ్చే ఆప్తుల కోసం గూడొదిలిన గువ్వల కోసం గుర్తొచ్చే నవ్వుల కోసం చూస్తున్నది గగనం నిండా ఎగిరే జండా రమ్మంటూ వీస్తున్నది దేశపు గాలి జెండా ఊంచా అనమంటూ ఓ సచిను కలాం కూడా Foreign pound దిక్కనుకుంటే ఈ ఎత్తుకు ఎదిగేవారా దేశం క్యాతిని పెంచేవారా నిజం తెలుసుకో వందే మాతరం వందే మాతరం నీ రుణం తీర్చుకో భారతీయుడై భువిని గెలుచుకో వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం
Writer(s): Lalita Suresh, D B Chary Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out