Lirik

ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా హే ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేల ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన జత వలతో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాదా లవ్ లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
Writer(s): Bhuvana Chandra, Anup Rubens Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out