Lirik

జై వీరాంజనేయ... ఓ... ఏయ్ దీని తస్సదియ్య... ఓ... దుమ్ము రేపే దమ్ము ఉంది చూపులోనే చురుకు ఉన్నదిరో... పంబ రేపేయ్ కుర్రోడా బెండు తీసేయ్ చిన్నోడా చెడుగుడు ఆడేయ్ బుల్లోడా నిప్పులు చెరిగేయ్ సూరీడా ప్రేమలో పడితే కష్టాలుంటాయ్ కష్టాలున్నపుడే ఈ కన్నీళ్ళోస్తాయ్ ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకులే అనుకోని ప్రేమించడం మానేస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుందిరో గుప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ఈ ప్రేమా ఎనకడుగేస్తే దక్కేనా వన్నెచిన్నెలా ఈ భామా తల్లిని ప్రేమిస్తాడోకడు పిల్లిని ప్రేమిస్తాడోకడు అక్కను ప్రేమిస్తాడోకడు కుక్కను ప్రేమిస్తాడోకడు అలాంటపుడు నువీ పిల్లను ప్రేమిస్తే తప్పేమిటిరో ప్రాణంగాను ప్రేమిస్తే ముందు వెనకా చూడకురో అడ్డం వస్తే ఎవడైనా తాడో పేడో తేల్చేయ్ రో ఓరోరి కుర్రోడో ఆ పిల్ల నీదేరో సీమంటూ కుట్టాక సిర్రెత్తు కొస్తాది ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది ప్రేమేగానయ్యిందంటే చచ్చేదాక అసలే వదలదురోయి విడదీయలనుకుంటున్న అయ్యెరామ ఇంచే కదలదు రోయి పెద్దోళ్ళ ఏడుపు చూసి కరగొద్దు ముద్దుల కన్నా అయ్యయ్యో అన్నావంటే నీ ప్రేమే నిండు సున్నా ప్రేమించుకోవయ్యో తప్పేమికాదయ్యో నవాబు గరీబు తేడాలే లేవంటూ ఆనాడు ఈనాడు గెలిచేదే ప్రేమంటా లోకంలో అన్నిటికన్నా అద్దిరబన్నా ప్రేమే గొప్పదిరోయి కుర్రోడు ముసలోడైన ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చేయాలి అదికూడా కాదంటావా ప్రాణాలే తీసేయాలి ఇటు చూడు బ్రహ్మయ్యో ఇతగాడి జోరయ్యో ప్రేమించే పిల్లాడు ఎదురించి నిలిచాడు ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నాడు సుడిగుండాలెన్నెదురైనా బిత్తర పోక ఒడ్డుకు చేరాలోయి బుసకొట్టే పాములు ఉన్నా తత్తరపడక బరిలో గెలవాలోయి అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా
Writer(s): Bhaskara Bhatla, Chakri Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out