Testi

ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటు అవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఎందుకా కంగారు ఒద్దులే బంగారు నిప్పులాంటి ఆశయాన్ని అంటదు ఏ కీడు మనసులో కన్నీరు తలచిన తనవారు తరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు గుండె గుడిలో నిన్ను కాచే కండ గల మొనగాడు మాట ఇస్తే తప్పని వాడు నిన్ను మనవాడు అనుకున్నాడు నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగు ఏసాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు సైన్యము అతడే రా ధైర్యము అతడే రా స్వామి కార్యం మర్చిపోని ధర్మము తనదేరా నీ కన్నులు వెలిగేదాకా తన కంటికి లేదే నిదుర జయ హనుమ అనుకోనీ చిరునవ్వుకు హామీ తనప్రేమ ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీతోనే ఉన్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
Writer(s): Sai Karthik, Ramajogayya Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out