Создатели

ИСПОЛНИТЕЛИ
Ghantasala
Ghantasala
Исполнитель
Bhanumathi Ramakrishna
Bhanumathi Ramakrishna
Исполнитель
МУЗЫКА И СЛОВА
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Композитор
C. Narayana Reddy
C. Narayana Reddy
Автор песен

Слова

చిత్రం: గృహలక్ష్మి (1967)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి
కన్నులే నీకోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని వేచియున్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా... వెన్నెలలే అందుకని వేచియున్నవా
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి... కూడదన్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
చందురుడే నిన్నుగని జాలిపడాలి... జాలిపడాలి
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
మాటలింక చాలునులే మామవున్నాడు... చందమామవున్నాడు
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి
Written by: C. Narayana Reddy, S. Rajeswara Rao
instagramSharePathic_arrow_out

Loading...