Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Tippu
Tippu
Performer
Naga Chaitanya
Naga Chaitanya
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓ ఓ ఒకే నిజాన్ని ఉరేసినారే ఓ ఓ
చెరో సగాన్ని ఓ ఓ మరో జగాన్ని వరించినారే ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం
ఇంతకాలము దారిలేని దూరం
జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే
హో స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే
ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే
విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
ఒక్క అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే
మైలు రాయికొక్క మాట మార్చు దూరం
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం
మూడుముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే
తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నది
మొదలైన చోటు మరిచిపోతే కాదే పయనమన్నది ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
Written by: Chandra Bose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...