album cover
Pranavalaya (From "Shyam Singha Roy")
album cover
Pranavalaya (From "Shyam Singha Roy") was released on December 19, 2021 by Saregama as a part of the album Pranavalaya (From "Shyam Singha Roy") - Single
December 19, 2021
LabelSaregama
BPM77
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ప్రణవాలయ పాహి
పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవీ
కురిపించవే కరుణాంబురాశి
ధీంతాన ధీం ధీం తాన, జతులతో
ప్రాణమే నాట్యం చేసే, గతులతో
నామ శతంబుల నతులతో
నాపైన నీ చూపు ఆపేలా
శరణంటినే జనని నాద వినోదిని
భువన పాలినివే
అనాథ రక్షణ
నీ విధి కాదటే
మొరవిని చేరవటే
నా ఆలోచనే
నిరంతరం నీకు నివాళినివ్వాలనీ
నాలో ఆవేదనే
నువ్వాదరించేలా నివేదనవ్వాలనీ
దేహమునే కోవెలగా
నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో
సేవలు చేసా
ప్రతి ఋతువు ప్రతి కృతువు
నీవని ఎంచా
సతతము నీ స్మరణేనే
ధీంతాన ధీం ధీం తాన
జతులతో
ప్రాణమే నాట్యం చేసే
గతులతో
నామ శతంబుల నతులతో
నాపైన నీ చూపు ఆపేలా
శరణంటినే జనని నాద వినోదిని
భువన పాలినివే
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
(ధింతాన ధింతాన తోం
ధింతాన ధింతాన తోం
ధింతాన ధింతాన తోం)
Written by: Mickey J Meyer, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...