Upcoming Concerts for Sid Sriram, Chaitan Bharadwaj & Vengi Sudhakar
Top Songs By Sid Sriram
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Sid Sriram
Lead Vocals
Chaitan Bharadwaj
Performer
Vengi Sudhakar
Performer
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Composer
Vengi Sudhakar
Songwriter
Lyrics
అందాల అందాల అందం
నన్నే తాకి పోయే
అందెల్లో జారి నే పడిపోయానే
మందార మందార గంధం
గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి
వలలే పట్టి నను పట్టే
అయ్యో నా కనులే చేరి
కలలడిగే పిల్లరా
నయగారమే నాపై చల్లే
బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శృతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే
అదో ఇదో ఎదో అనేసాకే
అలజడి కలిగే
యధా విధి ఎదే ఏమాయెనే
మది వలపులు చిలికే
హడావిడి పడి పడేసావే
మనసను మదినే
పదే పదే అదే సొదాయెనే
వెన్నెలైపోయే చీకటే వేళ
వన్నెలే ఉన్న వాకిటే
దారుణాలు తగవే
కన్నుల కారణాలు కనవే
విడువనులే చెలి నిను క్షణమే
బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శృతివే సంగతివే నీవే
సింధూరివే
తన్నారే తాన తార తారారే
తన్నాన తార తార తారందనా
ఆ తానన తందానే తానానే
తన్నానన తారరే తన్నానందతా
సరి గమ పద పెదాలేవో
ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలనే
తొలి వలపుల జతకే
నది నదానికే ముడేసాకే
తనువులు తొనికే
అదే అదే వ్యదే కధాయేనే
నీడలా వెంట సాగని
నీలి కళ్లలో నన్ను దాగని
వాయిదాలు అనకే
గుండెలో వేదనేదో వినవే
మనువడిగే మధనుడి స్వరమే
బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే
ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శృతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే
Written by: Chaitan Bharadwaj, Vengi Sudhakar