Credits
PERFORMING ARTISTS
Gayathri
Performer
COMPOSITION & LYRICS
K M Radha Krishnan
Composer
Veturi
Lyrics
Lyrics
నీలగగన ఘనవిచలన ధరణిజా శ్రీరమణ
ఆ... మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి
ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన
పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును
ఎత్తినా ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను
తాళికట్టే వేళలో
రామచక్కని సీతకి
ఎర్ర జాబిలి చేయి గిల్లి
రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే
చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు
నల్లనీ రఘురాముడు
రామచక్కని సీతకి
చుక్కనడిగా దిక్కునడిగా
చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన
నీటి తెరలే అడ్డు నిలిచే
చూసుకోమని మనసు తెలిపే
మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి
ఇంక ఎవరు మొగుడంట
రామచక్కని సీతకి
ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన
ఇంత మదన ప్రేమ
Written by: K M Radha Krishnan, Veturi

